“సుందరి” ప్రీ లుక్ పోస్టర్ తో ఆసక్తి రేపిన పూర్ణ.!

Published on Oct 22, 2020 2:11 pm IST

మన తెలుగు మరియు దేశీయ సినిమాలో మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు మంచి లభిస్తుంది. అలా పలు ఆసక్తికర చిత్రాలతో మరియు మొత్తం గ్లామరస్ అలాగే తన నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ పూర్ణ. ఇప్పుడు అలాంటి ఒక ఆసక్తికర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యింది.

చాలా కాలం టాలీవుడ్ కు దూరమైన ఈ టాలెంటెడ్ హీరోయిన్ తో దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సుందరి”. మొదటగా ఈ దర్శకుడు “నాటకం” అనే సినిమాతో పరిచయం అయ్యి ఇపుడు పూర్ణ తో రెండో ప్రాజెక్ట్ కు చేపట్టారు.

ఒక సాధారణ మహిళ తీసుకున్న ఒక ఊహించని నిర్ణయమే ఈ “సుందరి” అన్నట్టుగా ట్యాగ్ లైన్ తో చిత్ర యూనిట్ ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి ఆసక్తి రేపారు. అలాగే ఈ చిత్రంలో అర్జున్ అంబటి మేల్ లీడ్ లో నటిస్తుండగా సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

అంతే కాకుండా ఈ ఫ్యామిలీ డ్రామాను నిర్మాత రిజ్వాన్..రిజ్వాన్ ఎంటెర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణం వహిస్తున్నారు. షూటింగ్ అంతిమ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More