బాలకృష్ణ సినిమాకు హీరోయిన్ టెన్షన్..!

Published on Jul 21, 2021 1:29 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాను మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు హీరోయిన్ టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లను పెట్టాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఈ నేపధ్యంలో శృతిహాసన్, తమన్నాలను యూనిట్ సంప్రదించినట్టు టాక్ వినిపించింద్. అయితే ఇంతవరకు ఒక్క హీరోయిన్ కూడా ఫిక్స్ కాకపోవడంతో చిత్ర యూనిట్‌కి ఒకింత టెన్షన్ నెలకొన్నట్టు ప్రచారం జరుగుతుంది. చూడాలి మరీ ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన ఎవరు నటిస్తారన్నది.

సంబంధిత సమాచారం :