ఎన్టీఆర్ కొత్త సినిమాలో హీరోయిన్లు వీరే!

29th, January 2017 - 06:13:21 PM


‘జనతా గ్యారేజ్’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల చివరిదశలో ఉంది. ఫిబ్రవరి 10న ముహూర్త కార్యక్రమాలు జరుపుకొని, 15న సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు హీరోయిన్లుగా నటించేది ఎవరన్నది ఖరారైనట్లు తెలుస్తోంది.

ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతోన్న రాశిఖన్నా, నివేథా థామస్ ఇద్దరూ హీరోయిన్లుగా ఎంపికయినట్లు సమాచారం. టీమ్ నుంచి ఇదే విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జై లవకుశ పేరుతో తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుపుకుంటోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.