నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ చిత్రం “హాయ్ నాన్న”. మంచి బజ్ ఉన్న ఈ చిత్రం ప్రమోషన్స్ ని అయితే మేకర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు రాబోతున్న ఎన్నికల అంశాన్ని కూడా మేకర్స్ తమ ప్రమోషన్స్ లో భాగంగా వాడేసుకున్నారు.
నాని ఓ పొలిటీషియన్ గా మారి చేసిన ఇంట్రెస్టింగ్ వీడియో ఆడియెన్స్ లో క్లిక్ అయ్యింది. అందులో తాను మాట్లాడిన కొన్ని పాయింట్స్ అయితే నెటిజన్స్ లో బాగానే వైరల్ అవుతున్నాయి. దీనితో ఈ ప్రమోషనల్ ఆలోచన బాగానే వర్కౌట్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ డిసెంబర్ 7న చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.


