ఆడియన్స్ కి ‘హిడింబ’ టీమ్ విన్నపం

hidimbha
యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా అందాల నటి నందిత శ్వేతా హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిడింబ. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక ఇంట్రెస్టింగ్ జానర్ లో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిడింబ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్, రివర్స్ ట్రైలర్ ఇలా అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. యువ దర్శకుడు అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకరతో కలిసి గంగపట్నం శ్రీధర్ గ్రాండ్ గా నిర్మించారు.

వికాస్ బడిస మ్యూజిక్ అందించిన ఈ మూవీ జులై 20న థియేటర్స్ లోకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, దయచేసి తమ సినిమాకి సంభవించి కీలక సీన్స్ అలానే ట్విస్టులు వంటి వాటిని సోషల్ మీడియాలో రివీల్ చేయవద్దని ఆడియన్స్ ని నిర్మాతలు ఒక ప్రకటన ద్వారా విన్నవించారు. తద్వారా సినిమాకి ఇబ్బంది ఏర్పడుతుందని, తప్పకుండా అందరూ సినిమాని థియేటర్స్ లో చూసి ఆనందించాలని కోరారు మేకర్స్.

Exit mobile version