అడివి శేష్.. భిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అంటే వెంటనే గుట్టుకొచ్చే పేరు. థ్రిల్లర్ చిత్రాలు చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ హీరో. ‘క్షణం’ సినిమాతో మొదలుపెట్టి వరుసగా ‘గూఢచారి, ఎవరు’ లాంటి హిట్లను అందుకున్నాడు. దీంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది. స్వతహాగా రచయితా అయిన శేష్ తన సినిమాలకు తానే కథ, కథనాలు తయారుచేసుకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఆయన ‘మేజర్, గూఢచారి 2’ లాంటి సినిమాలు చేస్తున్నారు. అయితే చాన్నాళ్ల క్రితం శేష్ ఒక చిత్రానికి సైన్ చేశారు. ఇది బాలీవుడ్ మూవీ ‘టు స్టేట్స్’కు తెలుగు రీమేక్. వెంకట్ కుంచం దర్శకత్వంలో ఎం.ఎల్.వి.సత్యనారాయణ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. కానీ పలు కారణాల వలన సినిమా ఆగిపోతూ వచ్చింది. శేష్ తన తర్వాతి సినిమాలతో బిజీ అయిపోయారు. దీంతో సినిమా ఇంకాస్త ఆలస్యమైంది. అయితే తాజాగా ఆ చిత్ర నిర్మాత కోర్టుకు వెళ్లారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు జనవరి 5లోపు దీనికి సంబంధించిన వివరణను ఇవ్వాలంటూ అడివి శేష్ కు ఆదేశాలను జారీ చేసిందట. మరి ఈ వివాదం మీద శేష్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.


