బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దన్న హైకోర్ట్

బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దన్న హైకోర్ట్

Published on Jul 18, 2019 2:00 AM IST

త్వరలో ప్రారంభంకానున్న పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3పై కొన్ని రోజులుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. జర్నలిస్ట్, యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులు షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ నిర్వహిస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయగా నటి గాయత్రి గుప్త సైతం అవకాశం ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేశారని, వారి వలన తన కెరీర్ నాశనమైందని దుయ్యబట్టారు.

ఇక దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అయితే షో నిర్వాహకులను అరెస్ట్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నిర్వాహకులు కూడా తమపై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని, కేసుల్ని కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్ట్ నిర్వాహకులపై నమోదైన కేసుల పూర్తి వివరాలకు సమర్పించాలని పోలీసులను, పిటిషనర్లను ఆదేశించింది. అంతేకాదు అప్పటి వరకు నిర్వాహకుల్ని అరెస్ట్ చేయవద్దని తెలుపుతూ తదుపరి విచారణను వచ్చే బుదవారానికి వాయిదావేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు