టీజర్ తో రానున్న ఆర్ఎక్స్ 100 హీరో !

Published on Mar 17, 2019 9:44 am IST

ఆర్ఎక్స్ 100 తో సెన్సేషనల్ హిట్టు కొట్టిన యువ హీరో కార్తికేయ నటించిన రెండవ చిత్రం హిప్పీ. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రం యొక్క టీజర్ ను ఈనెల 20న విడుదలకానుంది. ‘మల్లన్న , తెరి , కబాలి’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత కలై పులి ఎస్ తాను ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు.

ఇక కార్తికేయ ఈ చిత్రం తోపాటు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక వీటితో పాటు ఆయన విక్రమ్ కుమార్ , నాని ల గ్యాంగ్ లీడర్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More