యూఎస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ తో “హిట్ 2” డే 1.!

యూఎస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ తో “హిట్ 2” డే 1.!

Published on Dec 3, 2022 1:30 PM IST

మల్టీ టాలెంటెడ్ ఫిలిం మేకర్ సహా నటుడు అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2” కోసం తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ హైప్ నడుమ అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ చిత్రం ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లతో అదరగొట్టింది.

మరి యూఎస్ లో ఈ చిత్రం కేవలం ప్రీమియర్స్ మరియు మొదటి రోజు వసూళ్లతోనే ఏకంగా 4 లక్షల డాలర్స్ కి పైగా రాబట్టినట్టుగా సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు తెలియజేస్తున్నారు. అలాగే ఈ మార్క్ డెఫినెట్ గా హాఫ్ మిలియన్ కి కూడా చేరే ఛాన్స్ ఉందని కూడా వారు చెప్తున్నారు. దీనితో అయితే యూఎస్ లో హిట్ కి ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు