హిట్ హిందీ రీమేక్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.

Published on Jul 15, 2020 10:53 am IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్. హీరో నాని నిర్మాణంలో రెండో చిత్రంగా వచ్చిన హిట్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. హీరో విశ్వక్ ఇంటెలిజెంట్ అండ్ సీరియస్ పోలీసుగా ఈ చిత్రంలో ఆకట్టుకున్నారు. కాగా ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తుండగా నేడు అధికారిక ప్రకటన రావడం జరిగింది.

రాజ్ కుమార్ రావ్ హీరోగా హిట్ హిందీ రీమేక్ తెరకెక్కనుంది. తెలుగులో తెరకెక్కించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అటు రాజ్ కుమార్ రావ్ సైతం హిట్ హిందీ రీమేక్ లో నటిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే జెర్సీ మూవీని షాహిద్ కపూర్ తో హిందీలో రీమేక్ చేస్తున్న దిల్ రాజు మరో నిర్మాత కుల్దీప్ రాథోడ్ తో కలిసి హిట్ మూవీ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More