హిట్ మూవీ టీజర్ డేట్ ఫిక్స్డ్

హిట్ మూవీ టీజర్ డేట్ ఫిక్స్డ్

Published on Jan 29, 2020 3:32 PM IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం హిట్. విశ్వక్ ఈ చిత్రంలో ఓ పోలీస్ అధికారిగా నటిస్తుండగా క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. హిట్ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ సిద్ధం చేశారు. ఈనెల 31న ఉదయం 10:00 గంటలకు హిట్ మూవీ టీజర్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ మరియు విశ్వక్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తుంది.

గత ఏడాది ఫలక్ నుమా దాస్ చిత్రంతో వచ్చిన విశ్వక్ ఈ ఏడాది హిట్ మూవీతో మొదలుపెట్టనున్నాడు . ఇక మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ పతాకంపై రెండవ చిత్రంగా హిట్ మూవీని నిర్మిస్తున్నారు. గతంలో ఆయన ‘అ’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించడం జరిగింది. హిట్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు