‘ఉస్తాద్ హోటల్‌’తో మళ్ళీ మెరవనున్న హిట్ పెయిర్!

Ok-Bangaram
చాలాకాలం తర్వాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం తనదైన ప్రేమకథతో ‘ఓకే బంగారం’ సినిమా ద్వారా హిట్ కొట్టిన విషయం తెలిసిందే! తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్‌ల జంట విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ జంటను చూడడం ‘ఓకే బంగారం’ సినిమా ద్వారానే మొదటి సారైనా, గతంలో మళయాల సినిమాల్లో ఈ ఇద్దరూ కలిసి రెండు సూపర్ హిట్ సినిమాల్లో జంటగా నటించి అప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ రెండు సినిమాల్లో ఒకటి ‘ఉస్తాద్ హోటల్’ కాగా, మరొకటి ‘100 డేస్ ఆఫ్ లవ్’. ప్రస్తుతం మళయాలంలో ఘన విజయం సాధించిన ‘ఉస్తాద్ హోటల్‌’ను తెలుగులో అదే పేరుతో ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌కు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాత ఈ సందర్భంగా తెలిపారు. మరి రెండోసారి దుల్కర్ సల్మాన్ – నిత్యామీనన్‌ల జంట తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అన్నది వేచిచూడాలి.

Exit mobile version