
సౌత్ ఇండియన్ బిగ్ బడ్జెట్ అండ్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ ‘రోబో 2’ని సెట్స్ పైకి తీసుకెళ్ళే సన్నాహాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని ఇండియన్ స్క్రీన్ పై కనీ వినుగని రేంజ్ లో, ఒక హాలీవుడ్ సినిమా సౌత్ ఇండియా నుంచి రానుంది అనే రేంజ్ లో శంకర్ తీయడానికి సన్నద్దమవుతున్నాడు. టోటల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీయనున్న ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ స్టార్స్ ని కూడా రంగంలోకి దింపాడు.
శంకర్ కి మొదటి నుంచీ హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచే ఆయనతో సాన్నిహిత్యం ఉంది. అందులో భాగంగానే ఆర్నాల్డ్ శంకర్ ఐ సినిమా ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఆ ఆడియో లాంచ్ లో ఆర్నాల్డ్ తనకి శంకర్ డైరెక్షన్ లో చేయడానికి సిద్దమే అని అన్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని నిజం చేసే పనిలో ఉన్నాడు శంకర్. ఇటీవలే శంకర్ ఆర్నాల్డ్ ని కలిసి రోబో 2 సినిమాలోని ఓ ముఖ్య అపాత్ర కోసం అప్రోచ్ అయ్యాడు. దానికి ఆర్నాల్డ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయనున్నారు. ఈ సినిమా కోసం ఆర్నాల్డ్ 25 రోజులు సమయం కేటాయించడానికి సిద్దమయ్యారు. ఒకసారి రజినీకాంత్ డేట్స్ ని ఫైనలైజ్ చేసాక ఆర్నాల్డ్ కి షూటింగ్ డేట్స్ ని అప్డేట్ చేస్తారు.
మరోవైపు శంకర్ విలన్ రోల్ కోసం అమీర్ ఖాన్ తో చర్చలు జరుపుతుంటే మరో పాత్ర కోసం దీపిక పడుకొనే ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే అమీ జాక్సన్ ని ఓ హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. డిసెంబర్ లో అధికారికంగా లాంచ్ కానున్న ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

