రామాయణ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్.. కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం

రామాయణ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్.. కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం

Published on May 29, 2025 12:00 PM IST

Ramayana

బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రామాయణం” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రామునిగా రణబీర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రావణ్ పాత్రలో యష్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి యష్ కేవలం నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా ఈ చిత్రానికి వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం కీలక పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ మ్యాడ్ మాక్స్ తదితర సినిమాలకి వర్క్ చేసిన గయ్ నోరిస్ ఈ చిత్రానికి పని చేస్తుండగా సెట్స్ నుంచి యష్ తో యాక్షన్ సన్నివేశాలపై చర్చిస్తున్న పిక్ ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

Ramayana

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు