వరుణ్ తేజ్ “గని” చిత్రానికి హాలీవుడ్ హంగులు.!

Published on May 26, 2021 3:00 pm IST

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తన మొదటి చిత్రం నుంచి కూడా రొటీన్ ఫార్మాట్ లో వెళ్లకుండా కొత్త కంటెంట్ తోనే అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఇప్పుడు చేస్తున్న తాజా చిత్రం “గని”. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గాను మేకర్స్ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో ఒక సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ కు గాను భారీ సెట్టింగ్ వెయ్యడమే కాకుండా ఈ పర్టిక్యులర్ సన్నివేశం కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవెల్ మరియు వాడ్ రింబర్ లను రంగంలోకి దింపుతున్నారట. హాలీవుడ్ లో టైటాన్స్, బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ “సుల్తాన్” తదితర చిత్రాలకు యాక్షన్ ఎపిసోడ్స్ అందించిన వారి నేతృత్వంలో ఆ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ జరగనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఆల్రెడీ 70 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ లో ఇవన్నీ ఉండనున్నాయి. ఇక ఈ చిత్రంలో వరుణ్ సరసన సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని బన్నీ వాస్ మరియు అల్లు బాబీలు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :