క్రేజీ డైరెక్టర్ కి టాలీవుడ్ లో పదేళ్ళు పూర్తి.!

క్రేజీ డైరెక్టర్ కి టాలీవుడ్ లో పదేళ్ళు పూర్తి.!

Published on May 18, 2015 11:48 AM IST

surendar-reddy
గత ఏడాది ‘రేసు గుర్రం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ సక్సెఫుల్ క్రేజీ డైరెక్టర్ ఈ ఏడాది క్రేజీ మూవీ కిక్ కి సీక్వెల్ అయిన కిక్ 2 తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమై 10 ఏళ్ళు పూర్తయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా వచ్చిన ‘అతనొక్కడే’ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు.

ఇప్పుడు తన కెరీర్ ని ప్రారంభించిన నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లోనే కిక్ 2 సినిమా చేస్తుండడం, అది కూడా తన జర్నీ పదేళ్ళు కంప్లీట్ చేసుకునే టైంలో మళ్ళీ కళ్యాణ్ రామ్ బ్యానర్ లో చెయ్యడం సురేందర్ రెడ్డికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ పదేళ్ళ జర్నీలో కిక్ 2 తో కలుపుకొని సురేందర్ రెడ్డి 7 సినిమాలు చేసాడు. కిక్ 2 సినిమా కిక్ కంటే పెద్ద హిట్ అవుతుందని సురేందర్ రెడ్డి చాలా నమ్మకంగా ఉన్నాడు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కిక్ 2 సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు