మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “వార్ 2”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా తాలూకా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది.
మరి ఈ ఈవెంట్ లో ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ హాజరు కాగా అభిమాన సంద్రం పోటెత్తారు. అయితే ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తాలూకా క్రేజ్ చూసి హృతిక్ షాకైన విజువల్ ఒకటి కనిపించింది. ఇద్దరు స్టార్స్ స్టేజి ఎక్కిన తర్వాత అలా ముందుకు నడుచుకుంటూ వచ్చారు.
ఈ సందర్భంలో హృతిక్ కి తారక్ అభిమాన సంద్రం చూసి షాకైన హృతిక్ ‘వాట్ ఈజ్ దిస్ యార్’ అంటూ తారక్ ఆదరణ చూసి తారక్ తో మాట్లాడ్డం జరిగింది. దీనితో ఈవెంట్ లో వన్ ఆఫ్ ది హైలైట్ మూమెంట్స్ లో ఒకటిగా ఇది మారింది అని చెప్పవచ్చు. ఇలా మరిన్ని గ్రాండ్ ఎలిమెంట్స్ తో వార్ 2 ఈవెంట్ ఎంతో అట్టహాసంగా నడిచింది.


