అడివి శేష్ “మేజర్” నుండి హృదయమా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ కి రెడీ!

Published on May 24, 2022 7:02 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, వీడియోలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ను జూన్ 3 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం నుండి హృదయమా అనే ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. రేపు ఉదయం 11:07 గంటలకు తెలుగు తో పాటుగా, హిందీ, మళయాళ భాషల్లో పాటను విడుదల చేయనున్నారు. సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ ఈ చిత్రం లో లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :