రామ్ చరణ్ సినిమాలో పవన్ రీమిక్స్ సాంగ్?

Published on Apr 27, 2014 5:42 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాలోని ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ పాటని రీమిక్స్ చేస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్ ని ఏడిపించే సమయంలో ఈ పాట వస్తుందని అంటున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ పాట ఒరిజినల్ వెర్షన్ సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘మిస్సమ్మ’ సినిమా లోనిది. ప్రస్తుత రాజకీయాల వల్ల అన్నదమ్ములైన చిరంజీవి – పవన్ కళ్యాణ్ వేరు వేరు పార్టీలకి ప్రచారం చేస్తూ దూరంగా ఉన్నా రామ్ చరణ్ మాత్రం పవన్ పాటని తన సినిమాలో రీమిక్స్ చేయడం చాలా మంచి పరిణామం అని చెప్పాలి.

కృష్ణ వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ కాంత్, రాజ్ కిరణ్, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :