రికార్డ్స్ సృష్టిస్తున్న చరణ్, బోయపాటి సినిమా !
Published on Feb 21, 2018 1:21 pm IST

స్టార్ హీరో రామ్ చరణ్, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న సినిమా బిజినెస్ పరంగా ఆరంభంలోనే రికార్డుల మోత మోగిస్తోంది. కొన్నాళ్ల క్రితమే మొదలైన సినిమా చిత్రీకరణలో ఇంకా చరణ్ పాలుపంచుకోకముందే చిత్ర హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు ఈ చిత్ర హిందీ డబ్బింగ్ హక్కులు రూ.22 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్లో ఉంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నాడు. అంతేగాక తమిళ నటుడు ప్రశాంత్ కూడ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

 
Like us on Facebook