టాక్..ధనుష్ – శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కి భారీ బడ్జెట్.?

Published on Feb 24, 2023 8:36 pm IST

కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సార్” తో టాలీవుడ్ సాలిడ్ వెల్కమ్ ని తాను అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో ధనుష్ తెలుగు మార్కెట్ లో కూడా తనదైన ముద్ర వేసాడు. ఇక నెక్స్ట్ అయితే ధనుష్ నుంచి మరిన్ని టాలీవుడ్ సినిమాలు ఉండగా వాటిలో దర్శకుడు శేఖర్ కమ్ముల తో అనౌన్స్ చేసిన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి.

అయితే ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ అయ్యినప్పటికీ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా పై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాకి గాను మేకర్స్ అయితే మాసివ్ బడ్జెట్ ని కేటాయిస్తున్నారట. ఈ సినిమా కోసం అయితే సుమారు 100 కోట్లకి పైగానే బడ్జెట్ ఉండనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ధనుష్ మరియు శేఖర్ కమ్ముల నుంచి ఓ సాలిడ్ బడ్జెట్ సినిమా పడబోతుందని అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :