ప్రభాస్ “సలార్”కు కూడా భారీ గానే..?

Published on Dec 4, 2020 2:06 pm IST

లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన ప్రభాస్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “సలార్” ఒక్కసారిగా ఇండియన్ సినిమా అంతటా హాట్ టాపిక్ అయ్యిపోయింది. ప్రభాస్ అలాగే కేజీయఫ్ డైరెక్టర్ అనే సౌండింగే ఇండియన్ బాక్సాఫీస్ ను మరోసారి ర్యాంప్ ఆడించడం ఖాయం అనిపించేలా చేసింది. దానికి తోడు అదిరిపోయే బ్యాక్ డ్రాప్ తో ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసెయ్యడం మరిన్ని అంచనాలు పెంచింది.

సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ఇలాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాకు ఎంత అవుతుంది అనే టాక్ లోకి వెళ్తే ఈ చిత్రానికి మేకర్స్ ప్రభాస్ రెమ్యునరేషన్ కాకుండానే 200 కోట్లకు పైగా పెడుతున్నారని తెలుస్తుంది. ఇక ప్రభాస్ రెమ్యునరేషన్ తో కలిపితే బడ్జెట్ 300 కోట్ల పైమాటే.. దీనితో ప్రభాస్ నుంచి మరో సాలిడ్ ప్రాజెక్ట్ అతి తక్కువ సమయంలో రెడీ అవుతుంది అని చెప్పాలి. ఇంకా దర్శకుడు నిర్మాతలు మాత్రమే రివీల్ అయిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై క్యాస్టింగ్ పరంగా మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More