మెగా అభిమానులందరికీ గత ఏడేళ్ళుగా ఉన్న ఒకే డ్రీమ్ మళ్ళీ మా మెగాస్టార్ ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి మా కోసం 150వ సినిమా తీస్తాడు.. వారి కోరుకున్న ఫుల్ లెంగ్త్ సినిమా చేయడానికి చిరంజీవికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది, అందుకే ఆయన దానికంటే ముందే తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాలో కాసేపు కనిపించి అభిమానుల ఆశని తీర్చనున్నాడు. కాసేపు అంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాకుండా ఓ రేంజ్ లోనే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్దమయ్యాడు.
ఇప్పటి వరకూ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసిన ఈ చిత్ర టీం నేటి నుంచి మెగాస్టార్ చిరంజీవిపై షూట్ చేయాల్సిన పార్ట్ షూటింగ్ ని మరికొద్ది కొద్ది సేపట్లో హైదరాబాద్ లో మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే దానికి సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటు చిరంజీవి పై ఒక ఫైట్ మరియు కొన్ని సీన్స్ ని షూట్ చేయనున్నారు. ఆ తర్వాత చిరుపై ఓ స్పెషల్ సాంగ్ ని కూడా షూట్ చేయనున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరు మేకప్ వేసుకొని కెమ్రెఆ ముందుకు రానుండడంతో ఈ చిత్ర టీంతో పాటు అభిమానులు కూడా మోమెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే అన్ని షూటింగ్ కార్యక్రమాలను అక్టోబర్ మొదటి వారం కల్లా ఫినిష్ చేయనున్నారు.
అందులో భాగంగా నిన్న రాత్రి నుంచే మెగా అభిమానులు #WelcomeBackMegaStar అనే హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. దీన్ని బట్టే మెగా అభిమానులు చిరు ఎంట్రీ కోసం ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. తమన్ అందించిన మ్యూజికల్ ఆల్బమ్ ని అక్టోబర్ 2న రిలీజ్ చేసిన సినిమాని అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు.


