‘అజ్ఞాతవాసి’ రెండవ రోజు వసూళ్ళలో భారీ తగ్గుదల !
Published on Jan 12, 2018 4:00 pm IST

మొదటిరోజు మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం మెల్లగా బాక్సాఫీస్ మీద పట్టు కోల్పోతోంది. భారీ క్రేజ్ మూలాన మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.26.93 కోట్ల వసూళ్లను రాబట్టి ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాదించిన ఈ చిత్రం రెండవ రోజు మాత్రం సరిగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది.

అభిమానుల నుండి కూడా సంతృప్తికరమైన మౌత్ టాక్ రాకపోవడంతో హ్యూజ్ డ్రాప్ కనబడింది. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో మొదటిరోజు రూ. 3.78 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 2వరోజు మాత్రం కేవలం రూ.28.12 లక్షలకే పరితమైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కలెక్షన్లు దెబ్బతినే అవకాశముంది. మరి మొదలుకానున్న పండుగ సీజన్ అయినా సినిమా పుంజుకోవడానికి సహకరిస్తుందేమో చూడాలి.

 
Like us on Facebook