“RC15” నాన్ థియేట్రికల్ బిజినెస్ గట్టిగానే!

Published on Jan 17, 2022 11:00 am IST

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా మూవీ RC15. ప్రముఖ దర్శకుడు శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజా గాసిప్ ప్రకారం, ZEE ఛానెల్ భారీ బడ్జెట్ చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ హక్కులను రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, యాక్షన్ థ్రిల్లర్ యొక్క స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 లాక్ చేయబడినట్లు తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :