ఇంటర్వ్యూ : శ్రీహర్ష – సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ ‘హుషారు’ స్క్రిప్ట్ రాశాను.

ఇంటర్వ్యూ : శ్రీహర్ష – సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ ‘హుషారు’ స్క్రిప్ట్ రాశాను.

Published on Nov 27, 2018 3:29 PM IST

నూతన దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘హుషారు’. యూత్ కి కనెక్ట్ అంశాలతో ట్రెండీగా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన విడుదల అవ్వనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం

దర్శకుడిగా మీ ప్రయాణం ఎప్పుడు మొదలైయింది. అలాగే మీ వ్యక్తగత విషయాల గురించి కూడా చెప్పండి ?

నా పూర్తి పేరు శ్రీహర్ష కొనుగంటి. నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరగాను. చిన్నప్పటినుంచీ కథలు మరియు సినిమాలు అంటే.. విపరీతమైన ఇష్టం. మా మదర్ తో ఎక్కువుగా సినిమాలు చూసేవాడ్ని. అయితే నేను బి.టెక్ చదువుతున్న టైంలో మా అమ్మ ఒక చిన్న కెమెరా కొని గిఫ్ట్ గా ఇచ్చింది. దాంతోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. బట్ అవి బాగా రాలేదు గాని.. ఫిల్మ్ మేకింగ్ పై మాత్రం నాకు బాగా ఇంట్రస్ట్ కలిగింది. కానీ మా ఇంట్లో వాళ్ల బలవంతం మీద సివిల్స్ కోచింగ్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అక్కడే ఈ హుషారు స్క్రిప్ట్ రాశాను.

సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ.. సినిమా స్క్రిప్ట్ ఎలా రాయగలిగారు ?

నేను అసలు కోచింగ్ లో జాయిన్ అయింది, సివిల్స్ కోసం కాదు అండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ల ప్రెజర్ నుండి బయట పడదామని. అలాగే బయటపడ్డాను. ఇక ఎలాంటి టెన్సన్స్ లేకుండా రిలాక్స్ గా ఈ స్క్రిప్ట్ రాసుకున్నాను.

ఈ సినిమా పోస్టర్ లో బీరు బాటిలే ఎక్కువుగా హైలెట్ అవుతుంది. అసలు బీరు బాటిల్ కి, ఈ సినిమాకి సంబంధం ఏమిటి ?

ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు బీరుకు ఒక ఇంటర్నల్ కనెక్షన్ ఉంటుంది. అంటే సినిమా మొత్తం బీరు ఇంటర్నల్ గా ట్రావెల్ అవుతూనే ఉంటుంది. దానికి మించి క్లైమాక్స్ లో బీరు సంబంధించిన సన్నివేశాలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. అందుకే బీరు బాటిల్ ని పోస్టర్ లో హైలెట్ చేశాము.

అంటే ‘బీరు’ను కూడా సినిమాలో ఓ పాత్రను చేశారు అన్నమాట.. ?

కథను బట్టి ఆలోచిస్తే.. బీరు కూడా మిగిలిన పాత్రలు లాగే ఓ కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు.

స్క్రిప్ట్ రాసుకున్న తరువాత నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ను కలిసారా ?

లేదండి. నాకు ఇండస్ట్రీలో అసలు పరిచయాలు లేవు. స్క్రిప్ట్ అయిపోయిన తరువాత, నేనే ఈ సినిమాని తిద్దామనుకున్నాను. ఒక చిన్న అఫీస్ సెటప్ పెట్టుకొని నచ్చినప్పుడు షూట్ చేద్దాం అని అన్ని ప్రిపేర్ చేసుకుంటున్న టైంలో ఒకాయన చెప్పారు. సినిమా తీసినా విడుదల అవ్వడం కష్టం అని, బయట ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చెయ్యమని ఆయన సజిషన్ ఇచ్చారు. అలా బయట ట్రై చేస్తున్న క్రమంలో బెక్కెం వేణుగోపాల్ గారి దగ్గరికి వచ్చాను. ఆయనకు రెండు గంటల్లో సబ్జెక్ట్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. అలా హుషారు మొదలైయింది.

ఇండస్ట్రీలో మీకు అసలు పరిచయాలు లేవు అన్నారు. మరి బెక్కెం వేణుగోపాల్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు ?

చెబితే కొంచెం ఫన్నీగా ఉంటుంది. నెట్ లో బెస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్ అని కొడితే లక్కీ మీడియా అని వచ్చింది. దాంతో లక్కీ మీడియా ఎవరిది, ఎక్కడ ఉందని అని సెర్చ్ చేస్తోన్న క్రమంలో లక్కీ మీడియా అఫీస్ కి వచ్చి బెక్కెం వేణుగోపాల్ గారిని కలిసాను. ఫస్ట్ మీటింగ్ లోనే ఆయనకు కథ చెప్పాను. ఆయన బాగుంది చేద్దాం అన్నారు.

‘హుషారు’ ప్రోమోస్ చూస్తుంటే వినూత్నంగా అనిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా కథ గురించి చెప్పండి ?

చిన్నప్పటినుంచీ కలిసి పెరిగిన ఓ నలుగురు స్నేహితులకు సంబంధించిన కథ అండి హుషారు సినిమా. సింపుల్ గా చెప్పుకుంటే.. నలుగురు కలిసి ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.

ఈ సినిమా ప్రధానంగా ఎవరికీ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు ?

అందరికీ కనెక్ట్ అవుతుంది అండి. అంటే ఒక నలుగురు వాళ్ళకి నచ్చినట్టు బతికితే అది సొసైటీకి నచ్చదు. ఇలాంటి అంశాల మీద కథనం నడుస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు