సాంకేతిక కారణాల వల్ల వాయిదాపడ్డ ‘హైపర్’ మ్యూజికల్ వీడియో

hyper.pn
‘నేను శైలజా’ విజయంతో కెరీర్లో నిలదొక్కుకున్న హీరో రామ్ తాజాగా చేస్తున్న చిత్రం ‘హైపర్’. రామ్ తో ‘కందిరీగ’ వంటి హిట్ చిత్రాన్ని తీసిన ‘సంతోష్ శ్రీనివాస్’ దీనికి దర్శకుడు. తండ్రి మీద అతి ప్రేమ చూపించే కొడుకు, ఆ ప్రేమను తట్టుకోలేని తండ్రి అనే లైన్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తాలూకు ట్రైలర్ ఈ మధ్యే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇకపోతే ఈ చిత్రం యొక్క మ్యూజికల్ వీడియోని ఈ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేస్తున్నట్టు నిర్మాత రామ్ ఆచంట తెలిపారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఘిబ్రన్ సంగీతం అందిస్తుండగా ఇందులో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సత్య రాజ్, నరేష్, తులసి వంటి సీనియర్ నటులు పలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్ బ్యానర్ పై రామ్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే రామ్, కరుణాకరన్ దర్శకత్వంలో ‘క్రేజీ ఫీలింగ్’ సినిమాని త్వరలోనే స్టార్ట్ చేయనున్నాడు.