పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద స్టార్ అవుతారని అస్సలు ఊహించలేదంటున్న నటి

Published on Aug 5, 2018 4:05 pm IST

అక్కినేని నాగేశ్వరరావుగారి మనవరాలిగా ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యారు సుప్రియా యార్లగడ్డ. మళ్ళీ దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత ఆమె వెండితెరకు “గూఢచారి”తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నదియా ఖురేషీ అనే పాత్రలో కనిపించి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సుప్రియా యార్లగడ్డ. ప్రస్తుతం ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు సెలెబ్రేటిస్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే సుప్రియా యార్లగడ్డ మాట్లాడుతూ నేను సినిమాలు చేయటం మానేసి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అవుతొంది. అయినా ఇప్పటికీ నన్ను పవన్‌కల్యాణ్‌ హీరోయిన్‌ గానే గుర్తుంచుకున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకంటూ సొంతగా గుర్తింపు రాదా అనుకుంటుంటాను. అని తెలుపుతూ నిజంగా పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి వస్తారని ఇంత పెద్ద స్టార్ అవుతారని నేను అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చారు.

కాగా శుక్రవారం విడుదలైన గూఢచారికి విశేషమైన స్పందన లభిస్తోంది. శశి కిరన్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

సంబంధిత సమాచారం :

X
More