వేధింపుల పై హీరోయిన్ కామెంట్స్ !

Published on May 7, 2019 8:10 pm IST

సినీ పరిశ్రమల్లో ఆ మధ్య మొదలైన ‘మీటూ’ ఉద్యమం మొత్తానికి ఇప్పటికి కూడా ఎవరొక హీరోయిన్ కారణంగా కొనసాగుతూనే ఉంది. కాగా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే కొందరు నటీమణులు తమకు ఎదురైన చేదు సంఘటనలు వేధింపులను బాహాటంగానే చెప్పుకొచ్చారు. తాజాగా మాజీ హీరోయిన్ సమీరా రెడ్డి కూడా నిజంగానే సినీ పరిశ్రమల్లో నటీమణులను చాలా తక్కువగా చూస్తుంటారని.. మహిళలను ట్రీట్ చేసే విధానం మారాలని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది.

సమీరా రెడ్డి మాట్లాడుతూ… ‘సినీ పరిశ్రమల్లో లేడీస్ కి అవకాశాలను ఎరగా చూపిస్తూ వాళ్ళను వాడుకోవటానికి చూస్తారని, ఒకవిధంగా మహిళ అంటే కేవలం గ్లామర్ వస్తువుగానే చూస్తారని.. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను తానూ ఎదుర్కొన్నట్లు సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది. మొత్తానికి తనుశ్రీ దత్తా – నానా పటేకర్‌ వివాదంతో మొదలైన ఈ ‘మీటూ’ ఉద్యమానికి ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు తమ మద్దతును పలికిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More