ఆ సినిమాలు చూడటం నాకు బాగా ఇష్టం – ఈషా రెబ్బా

Published on Dec 6, 2018 3:57 pm IST


సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కథానాయకుడిగా రాబోతున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్రంలో సుమంత్ సరసన ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా భారీ అంచనాలు ఉన్న ‘సుబ్రహ్మణ్యపురం’ రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ ఈషా రెబ్బా మీడియాతో మాట్లాడారు.

ఈషా మాట్లాడుతూ.. సంతోష్ కథ చెప్పగానే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అన్ని రకాల సినిమాలు చూస్తాను. కానీ నెక్ట్స్ ఏమవుతుంది అని టెన్సన్ పడుతూ సినిమాలు చూడటం నాకు బాగా ఇష్టం. ఆ ఎలిమెంట్స్ సుబ్రహ్యణ్యపురం లో చాలా ఉన్నాయి. అని ఈషా రెబ్బా తెలిపింది.

సుమంత్ కెరీర్ లోనే ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :