సమీక్ష : ఐ లవ్ యు – ఓన్లీ ఉపేంద్ర మార్క్ ఇష్టపడేవారికి మాత్రమే !

Published on Jun 15, 2019 4:00 am IST

విడుదల తేదీ : జూన్ 14, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ఉపేంద్ర, రచితా రామ్, బ్రహ్మానందం తదితరులు.

దర్శకత్వం : ఆర్ చంద్రు

నిర్మాత : ఆర్ చంద్రు

సంగీతం : డా కిరణ్ టి

సినిమాటోగ్రఫర్ : చిన్ని ప్రకాష్, ధను, మోహన్

ఎడిటర్ : దీపు యస్ కుమార్

విలక్షణ నటుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చాలా కాలం తరువాత “ఐ లవ్ యు” మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఉపేంద్ర,రా,రక్త కన్నీరు,వంటి చిత్రాలలో ఉపేంద్ర తెలుగు లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పటికీ ఉపేంద్ర చిత్రాలంటే అమితాసక్తి చూపిస్తారు. మరి నేడు తెలుగు, కన్నడ భాషలలో విడుదలైన “ఐ లవ్ యూ” మూవీ ఎలా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.

 

కథ :

 

ప్రేమలో విఫలమైన సంతోష్ నారాయణ(ఉపేంద్ర) గతాన్ని మర్చిపోయి జీవితంలో ఎదుగుతూ ఓ పెద్ద ధనవంతుడవుతాడు. అలాగే తన బంధు వర్గానికి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడతాడు. అంతా ప్రశాంతగా సాగుతున్న తరుణంలో సంతోష్ నారాయణ్ మాజీ ప్రియురాలైన ధర్మిక(రచితా రామ్)నుండి అతనికి ఫోన్ వస్తుంది. ధర్మిక నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను అని సంతోష్ నారాయణ్ తో చెప్తుంది. ఆ మాట విన్న సంతోష్ నారాయణ్ షాక్ కి గురవుతాడు. కాదని వదిలేసి వెళ్లిన ధర్మిక మళ్ళీ సంతోష్ ని ఎందుకు కావాలనుకుంది ? సంతోష్ ని కలవాలనుకున్న ధర్మిక ఆంతర్యం ఏమిటి ? సంతోష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? చివరికీ వాళ్ళ కథలు ఎలా ముగిసాయి ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

గత చిత్రాలతో పోల్చుకుంటే ఉపేంద్ర చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఆయన డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ ఐయ్యాయి. కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలలో ఆయన ఫుల్ ఎనర్జిటిక్ గా నటించారు. అలాగే సమకాలీన ప్రేమ, ప్రేమికులపై ఆయన వేసే సెట్టైర్స్ బాగా పేలాయి. అలాగే భావోద్వేగ సన్నివేశలలో ఉపేంద్ర నటన సన్నివేశాలకు ప్రాణం పోసింది.

రచిత రామ్ తన పాత్రకు సాధ్యమైనంత వరకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించింది. ఉపేంద్ర ప్రేమను తిరస్కరించే సన్నివేశాలలో పాత్రకు దగ్గ పరిణితి నటన కనబరిచింది. ఉపేంద్ర భార్యగా, గృహిణి పాత్రలో ఆమె చక్కగా సరిపోయింది. ఉపేంద్ర మిత్రులుగా నటించిన నటులందరూ తమతమ పాత్రల పరిధిలో పర్వాలేదనిపించారు. ఉపేంద్ర, రచిత రామ్ మధ్య సన్నివేశాలకు ప్రేక్షకులను అలరిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ మూవీలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన లోపం ఏమిటంటే దర్శకుడు, తాను చెప్పాలనుకున్న విషయాన్నీ బలంగా చెప్పలేకపోయాడు. మొదటి భాగం పర్వాలేదనిపించిన.. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కధనం నెమ్మదించడంతో పాటు, ఆసక్తిని కోల్పోయింది. ఇలాంటి సినిమాలలో ప్రేమికుల మధ్య నడిచే సన్నివేశలతో కథను రక్తి కట్టించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ చిత్రంలో అది లోపించింది.

క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను వేగంగా నడిపించడంతో అంత ప్రభావవంతగా అవి పండలేదు. బ్రహ్మానందం లాంటి హాస్యనటుడ్ని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. కేవలం సినిమాలోని ఒక సన్నివేశంలోనే ఆయన కామెడి పండింది.

 

సాంకేతిక విభాగం:

 

దర్శకుడు, కథా రచయిత అయిన ఆర్ చంద్రు రాసుకున్న భార్య భర్తల మధ్య ఉండే రిలేషన్స్ గురించి చక్కగా వర్ణించాడు. కానీ కథకు తగ్గట్టుగా కథనం రాసుకుంటే మూవీ ఇంకా ఆసక్తికరంగా ఉండేది.

ఎడిటర్ గా కథకు తగ్గట్టుగా సినిమా నిడివి ఉండేలా చూడడంలో ఎడిటర్ దీపు ఎస్ కుమార్ పర్వాలేదనిపించారు. సినెమాటోగ్రపీ, ఆర్ట్ వర్క్ చాల చక్కగా ఉన్నాయి. చిన్ని ప్రకాష్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

నేటి సమాజంలో యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది ఎలావుంటుంది, అలాగే భార్యభర్తల మధ్య రిలేషన్ ఎలా ఉండాలని చెప్పే కథే “ఐ లవ్ యూ”. ఈ జనరేషన్ యూత్ లవ్ ని టార్గెట్ చేస్తూ ఉపేంద్ర చెప్పే సెటైరికల్ డైలాగ్స్, ఉపేంద్ర మార్క్ మేనరిజంతో మొదటిసగం పర్వాలేదనే అనుభూతి కలిగించినప్పటికీ.. బలంలేని స్క్రీన్ ప్లే వలన సెకండ్ హాఫ్ కథ బాగా సాగతీతకు గురైంది. సరదాగా అలా ఓ మూవీ చూసొద్దాం అనుకునేవాళ్లకు ఈ మూవీ ఒకే కానీ, ఓ మంచి సినిమాతో ఈ వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ మూవీకి వెళ్లకపోవడమే మంచిది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

   Click here for English Review

సంబంధిత సమాచారం :

X
More