‘ఎన్టీఆర్’ చిత్రంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాను – విద్యాబాలన్

‘ఎన్టీఆర్’ చిత్రంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాను – విద్యాబాలన్

Published on Jul 16, 2018 5:05 PM IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో.. ఎన్టీఆర్ పాత్రను బాలయ్య, ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్న విషయం తెలిసిందే. విద్యాబాలన్ కు తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.

కాగా తాజాగా విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్ లో తన పాత్ర కేవలం అతిధి పాత్ర కాదని, తాను చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు. కాగా ఈ చిత్రంలో ముఖ్యంగా బసవతారకంగారి చివరి రోజుల్లోని సంఘటనల సంబంధించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట. కాబట్టి బసవతారకంగారి పాత్రకు విద్యాబాలన్ తన నటనతో నిండుదనం తెస్తుందని చిత్రబృందం బలంగా నమ్ముతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు