‘చిన్నదాన నీకోసం’లో చిన్నది చాలా తెలివైనది – మిస్త్రీ

Mishti

మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘చిన్నదాన నీకోసం’ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది హీరోయిన్ మిస్త్రీ చక్రవర్తి. ఈ అమ్మడు నటించిన తొలి తెలుగు సినిమా ఇది. ప్రేక్షకులు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మిస్త్రీ చక్రవర్తి కాస్త టెన్షన్ తో ఉంది. ప్రేమకథా చిత్రాల స్పెసిలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందని మిస్త్రీ తెలిపింది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. అని చెప్పింది.

ఈ సినిమాలో నా పెర్ఫార్మన్స్ కి మంచి రివ్యూస్ వస్తే ఆ క్రిడిట్ అంతా దర్శకుడు కరుణాకరన్ గారికి చెందుతుంది. ప్రతి సన్నివేశం హావభావాలతో సహా ఎంతో వివరంగా చెప్పేవారు. నితిన్ తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది, గ్రేట్ కో స్టార్. ఈ సినిమాలో నేను ఇంటెలిజెంట్ గర్ల్ క్యారెక్టర్ లో నటించాను. అని మిస్త్రీ చక్రవర్తి తెలిపింది.

Exit mobile version