ఇంటర్వ్యూ : హెబ్బా పటేల్ – ఇంతకు ముందుతో పోల్చుకుంటే రాజ్ తరుణ్ లో పెరిగింది !
Published on Jun 1, 2017 2:23 pm IST


వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ రేపు మరొక చిత్రం ‘అంధగాడు’ తో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో సినిమాకు సంబందించిన పలు విషయాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నా క్యారెక్టర్ పేరు నేత్ర. ఐ డాక్టర్ని. హీరోకి చూపు రావడంలో హెల్ప్ చేస్తుంటాను. చాలా మంచి పాత్ర. సెటిల్డ్ గా, సింపుల్ గా ఉంటుంది.

ప్ర) అసలు సినిమా కథేంటి ?
జ) చూపులేని హీరో వలన నా కుటుంబంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని నేను ఎలా పేస్ చేస్తాను అనేదే ఈ సినిమా కథ.

ప్ర) రాజ్ తరుణ్ తో ఇది మూడు సినిమాలు చేశారు. అతనిలో అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమైనా వచ్చాయా ?
జ) అంటే ఇంతకు ముందుకన్నా అతనిలో సహనం కాస్త పెరిగింది. ఇక నటన పరంగా అంటే అతనెప్పుడూ బాగానే చేస్తాడు.

ప్ర) పెద్ద హీరోలతో సినిమాలెందుకు చేయడం లేదు ?
జ) పెద్ద హీరోలతో చేయకూడదని కాదు.. కొన్ని ప్రాజెక్ట్స్ రావడం, అనుకోని కారణాల వలన ఆగిపోవడం వంటివి జరిగాయి. కానీ ఫ్యూచర్లో తప్పకుండా చేస్తాను.

ప్ర) పలనా హీరోతో, డైరెక్టర్ తో వర్క్ చేయాలనే డ్రీమ్ ఏమైనా ఉందా ?
జ) పర్టిక్యులర్ గా పలనా వాళ్ళతోనే చేయాలనేం లేదు. అందరు హీరోలు, అందరు డైరెక్టరక్టర్లతో చేయాలని ఉంది.

ప్ర) శ్రీనివాస్ కొత్త డైరెక్టర్ కదా అతని వర్క్ ఎలా ఉంది ?
జ) ఆయన బేసిక్ గా రైటర్. చాలా సినిమాలకు పనిచేశారు. కాబట్టి సినిమా ఎలా తీయాలి అనే ఐడియా ఉంది. ఆయన వర్క్ కూడా చాలా బాగుంటుంది. కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి.

ప్ర) ఈ సినిమాలో మీ డ్యాన్సుల గురించి చెప్పండి ?
జ) నేను గొప్ప డ్యాన్సర్ కాదు కాబట్టి కొరియోగ్రఫర్లు కూడా నా బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టే స్టెప్స్ కంపోజ్ చేస్తారు. ఇందులో ఒక పాటలో మాత్రమే డాన్స్ ఉంటుంది. పాటకు ముందు చాలా సేపు ప్రాక్టీస్ చేశాను.

ప్ర) రాజ్ తరుణ్ తో సినిమాలకి బ్రేక్ ఇస్తారా ?
జ) అవును. కాస్త గ్యాప్ ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే అన్నిసార్లు మా ఇద్దర్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఎవరికైనా బోర్ కొడుతోంది కదా.

ప్ర) మీరు జయాపజయాల్ని ఎలా తీసుకుంటారు ?
జ) హిట్, ఫ్లాప్ అనేవి మన చేతుల్లో లేవు. నా వరకు సరిగా చేశానా లేదా అనేది మాత్రమే చూస్తాను. నా పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకి నచ్చితే నాకు అదే చాలు.

ప్ర) మీకు రిలీజ్ టెంక్షన్ ఉంటుందా ?
జ) తప్పకుండా ఉంటుంది. సినిమా ఎంత బాగా వచ్చినా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం ఖచ్చితంగా ఉంటుంది.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాలేమిటి ?
జ) ఇంకా ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. వరుసగా సినిమాలు చేస్తుండటం వలన అలసిపోయాను. ఒక నెల రోజులు రిలాక్స్ అయి ఆ తర్వాత సినిమాలు స్టార్ట్ చేస్తాను.

 
Like us on Facebook