నాగబాబుకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తాడట !

Published on Mar 20, 2019 1:00 am IST

ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు శివాజీరాజీ – నరేష్‌ ప్యానల్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. పోటీలో మా అధ్యక్షుడిగా నరేశ్‌‌ విజయం సాధించారు. శివాజీ రాజా పై ఆయన 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందారు.

అయితే నరేష్ విజయంలో నాగబాబు సపోర్ట్ కూడా చాలా ఉంది. ఎన్నికలకు ముందే నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ నరేష్ ప్యానల్ కు ఓటు వెయ్యాల్సిందిగా కోరారు. ఏదయితే ఏం శివాజీ రాజా ఓడిపోయాడు. దాంతో శివాజీ రాజా మొత్తానికి బాగానే ఫీల్ అయినట్లు ఉన్నారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘వృద్ధ కళాకారుల కోసం తానూ ఓ ఓల్డేజ్ హోమ్ ను కట్టాలని అనుకున్నానని… కానీ కొంతమంది దాని పై నీళ్లు చల్లారని ఆరోపించారు. అదేవిధంగా ఫ్రెండ్ అనుకున్న నాగబాబు కూడా తనకు వ్యతిరేఖంగా ప్రెస్ మీట్ పెట్టి తనను విమర్శించడం బాగాలేదని… ఖచ్చితంగా త్వరలోనే తన నుండి నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ అందుతుందని శివాజీ రాజా వెల్లడించారు.

సంబంధిత సమాచారం :

X
More