‘వారణాసి’: అసలైన ‘రామాయణ’ ఎపిసోడ్ నేను చూపిస్తా అంటున్న రాజమౌళి!

‘వారణాసి’: అసలైన ‘రామాయణ’ ఎపిసోడ్ నేను చూపిస్తా అంటున్న రాజమౌళి!

Published on Oct 11, 2026 10:28 PM IST

ఇపుడు ఇండియన్ సినిమా నుంచి రానున్న ఎపిక్ చిత్రాల్లో బాలీవుడ్ నుంచి ‘రామాయణ’ మన తెలుగు నుంచి ‘వారణాసి’ సినిమాలే సమాన స్కేల్ తో రాబోతున్నాయి అని చెప్పాలి. అయితే ఈ రెండు సినిమాలకి కామన్ గా ఉన్న పాయింట్ లలో ‘రామాయణ’ కూడా ఒకటి. అయితే ‘వారణాసి’లో కేవలం కొంతసేపు మాత్రమే రామాయణ ఎపిసోడ్ కనిపిస్తుంది.

అయినప్పటికీ ఈ సీక్వెన్స్ పట్ల అంచనాలు పీక్ లో ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా రాజమౌళి చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఎంపైర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రాజమౌళి ఇప్పుడు వరకు వచ్చిన రామాయణ సినిమాలు ఏవీ తనకి అంత సంతృప్తికరంగా అనిపించలేదు అని రామాయణకి అవి పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్టు అనిపించలేదు.

కానీ తన వారణాసి లో రామాయణ తాలూకా గ్రాండియర్ అంటే ఏంటో చూపిస్తానని తెలిపారట. మరి ఉన్న ఆ కాస్త నిడివిలోనే జక్కన్న ఏ రేంజ్ ట్రీట్ ఇవ్వబోతున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఎపిక్ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు