ఇప్పుడు కోలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమానే జైలర్ 2. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేసిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్రెడీ తమిళ్ ఈవెంట్ ని స్కిప్ చేసిన సంగతి తెలిసిందే. కానీ తెలుగులో మాత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ని లాక్ చేశారు.
రేపు అక్టోబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి శిల్ప కళావేదికలో జరగనున్నట్టు ఖరారు అయ్యింది. అయితే ఈ ఈవెంట్ లో కొన్ని అంశాలు హాట్ టాపిక్ గా మారనున్నాయి అని చెప్పొచ్చు. రజినీకాంత్ దాదాపు ఈ ఈవెంట్ కి హాజరు కావడం లేదట. ఇక మిగతా యూనిట్ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ కోసం మాట్లాడేది కూడా పక్కన పెడితే ఈ సినిమా టికెట్ రేట్స్ హైక్స్ పరంగా డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తిగా మారింది. ఈ టాపిక్ తాను టచ్ చేస్తారా లేదా వదిలేస్తారా అనేది రేపు ఓ క్లారిటీ వస్తుంది.


