ఒక పక్క భారీ పాన్ ఇండియా సినిమాలు మరో పక్క ఇతర భాషల్లో కూడా సినిమాలు ఇంకోపక్క మిడ్ రేంజ్ సినిమాలు కూడా చేస్తూ ఒక పర్ఫెక్ట్ అండ్ బ్యాలెన్సుడ్ నిర్మాణ సంస్థగా దూసుకెళ్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇక లేటెస్ట్ గా ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తీసుకురావడానికి సిద్ధం అవుతున్నారు.
నూతన నటీనటుల్ని పరిచయం చేస్తూ క్రేజీ అనౌన్సమెంట్ అందించారు. హీరోగా జై జస్టీ అనే కొత్త కుర్రాడిని అలాగే ప్రముఖ నటుడు శ్రీకాంత్ మేక తనయురాలు మేధా మేకను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ చిత్రాన్ని పృథ్వీ వనం అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు కూడా రివీల్ చేశారు.
అలాగే ఈ సినిమాకి ఆంధ్ర కింగ్ తాలూకా, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ బాబు పి మూలకథ అందించినట్టు తెలుస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీపై మరిన్ని డీటెయిల్స్ ని మరో అప్డేట్ గా రేపు అక్టోబర్ 12న ఉదయం 10 గంటల 26 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టు ఖరారు చేశారు.


