సాలిడ్ బుకింగ్స్ తో శ్రీవిష్ణు సినిమా హవా!

సాలిడ్ బుకింగ్స్ తో శ్రీవిష్ణు సినిమా హవా!

Published on Oct 11, 2026 8:00 PM IST

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన మరో క్లీన్ హిట్ చిత్రమే ‘కామ్రేడ్ కళ్యాణ్’. టాలెంటెడ్ హీరో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా మహిమా నంబియార్ హీరోయిన్ గా దర్శకుడు జానకిరామ్ మారెళ్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ డే కంటే డే 2 డబుల్ మార్జిన్ వసూళ్లు సొంతం చేసుకొని అదరగొట్టింది. ఇక ఈ సినిమా రెండో రోజు గ్రాఫ్ ని పెంచుకోడమే కాకుండా టోటల్ గా బుక్ మై షోలో భారీ బుకింగ్స్ నమోదు చేసింది.

ఈ చిత్రం ఒక్క బుక్ మై షో నుంచే మొత్తంగా 3 లక్షల టికెట్స్ కి పైగా సేల్ చేసుకోవడం విశేషం. దీనితో కామ్రేడ్ కళ్యాణ్ కి ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఆదివారం వసూళ్లు కూడా మరింత బెటర్ గా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ మూడో రోజు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా వెంకట కృష్ణ కర్ణాటి నిర్మాణం వహించారు.

తాజా వార్తలు