‘రాకా’ కూడా ఎండ్ కి వచ్చేసిందా?

‘రాకా’ కూడా ఎండ్ కి వచ్చేసిందా?

Published on Oct 11, 2026 9:03 PM IST

raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీతో చేస్తున్న భారీ చిత్రం ‘రాకా’ కోసం అందరికీ తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఎంతో కాలంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా ముంబై లోనే తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ట్రీట్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా షూట్ కూడా ఇప్పుడు ఎండ్ కి రాబోతున్నట్టు తెలుస్తుంది.

పార్ట్ 1 షూట్ దాదాపు ఈ ఏడాది ఎండింగ్ కి పూర్తి చేయనున్నట్టు టాక్. ఇక దీని తర్వాత బన్నీ లోకేష్ కనగరాజ్ తో ప్రాజెక్ట్ కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక రాకా సినిమాలో అనేకమంది హీరోయిన్స్ నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు