ఇకపై సినిమాలు చేయబోవడంలేదన్న కమల్ హాసన్ !
Published on Jun 30, 2018 8:26 pm IST

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం తన పొలిటికల్ పార్ట్ ‘మక్కల్ నీది మయమ్’ సంస్థాగత ఏర్పాట్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో పాటే ఆయన తన సినిమాలు ‘విశ్వరూపం -2, శభాష్ నాయుడు, భారతీయడు’ పనులను కూడ చూసుకుంటున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పలు విషయాలను చర్చించారు.

అభిమానుల్లో ఒకరు మీరు సత్యజిత్ రేఎం, శ్యామ్ బెంగాల్ వంటి దర్శకులతో పనిచేయకపోవడం పై బాధపడుతున్నారా అని అడగ్గా కమల్ సమాధానం ఇస్తూ వాళ్ళు నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళు నాకు ఎప్పుడూ సినిమా ఆఫర్ ఇవ్వలేదు. పైగా సత్యజిత్ రే ఇప్పుడు లేరు. నేను కూడా ఇకపై సినిమాలు చేయబోవడం లేదు అంటూ సినిమాల నుండి తన రిటైర్మెంట్ ను త్వరలోనే ఉంటుందని హింట్ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook