ఇంటర్వ్యూ : వెంకి కుడుముల – నన్ను నమ్మినందుకు నాగ శౌర్య తల్లిదండ్రులకు కృతఙ్ఞతలు చెప్పాలి !

ఇంటర్వ్యూ : వెంకి కుడుముల – నన్ను నమ్మినందుకు నాగ శౌర్య తల్లిదండ్రులకు కృతఙ్ఞతలు చెప్పాలి !

Published on Jan 29, 2018 5:49 PM IST

నాగ శౌర్య, రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా నటించిన ‘ఛలో’ చిత్రం ఫిబ్రవరి 2 న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్న వెంకీ కుడుముల. చిత్ర రిలీజ్ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ నైపథ్యం ఏంటి ?

జ) మాది ఖమ్మం జిల్లా అశ్వరావు పేట. సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తితో డైరెక్టర్ తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. ఆయన దర్శకత్వం వహించిన ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాలో చిన్న పాత్రలో కూడా నటించాను. ఆ తరువాత త్రివిక్రమ్ ‘అ.. ఆ..’ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాను.

ప్ర) ‘ఛలో’ సినిమా ఎలా ప్రారంభమయ్యింది ?

జ) నాగ శౌర్య నటించిన ‘జాదుగాడు’ సినిమాకు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసాను. ఆ సమయంలో నాగ శౌర్య ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని రమ్మని చెప్పగా నేను ‘ఛలో’ స్టోరీ వినిపించాను. అది నచ్చి వెంటనే ఓకే చేసాడు. ఆ తరువాత సినిమా ప్రారంభమయ్యింది.

ప్ర) మీ మొదటి సినిమా నాగ శౌర్య హోమ్ ప్రొడక్షన్స్ లో చేశారు. దాని గురించి ?

ప్ర) నా కథను నమ్మి నాగ శౌర్య పేరెంట్స్ డబ్బు పెట్టి చిత్రాన్ని నిర్మించినందుకు వారికి నా కృతజ్ఞతలు చెప్పాలి. నాపై వారి నమ్మకాన్ని ఓమ్ము చెయ్యకుండా సినిమాను తెరకెక్కించడం జరిగింది. నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

ప్ర) హీరోయిన్ రష్మిక మందన్నను సెలెక్ట్ చెయ్యడానికి కారణం ?

జ) ‘ఛలో’ అనేది ప్యూర్ లవ్ స్టొరీ. ఈ సినిమా కోసం కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నాను. అలాగే కన్నడలో ‘కిరిక్ పార్టీ’ చూశాక రష్మిక ఈ కథకు సూట్ అవుతుందనిపించింది. ఆ తరువాత నాగ శౌర్య పేరెంట్స్ ను సంప్రదించడం, వారు ఓకే అనడంతో ఆ అమ్మాయిని ఫైనల్ చేసాం.

ప్ర) మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గురించి ?

జ) సాగర్ మణిశర్మగారి అబ్బాయిని అందరికి తెలుసు. ‘జాదుగాడు’ సినిమా సమయంలో ఆయన నాకు పరిచయమయ్యారు. ‘ఛలో’ సినిమా కు సాగర్ బాగుంటుందని నాగ శౌర్యకు చెప్పగా ఆయన సరే అన్నాడు.నా నమ్మకం ప్రకారమే సాగర్ ‘ఛలో’ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.

ప్ర) మీ తదుపరి సినిమా ఏంటి ?

జ) ప్రస్తుతం నేను ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. ‘ఛలో’ రిలీజ్ అయ్యాక కొత్త సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు