నాగ చైతన్యను దృష్టిలో పెట్టుకునే కథ రాశాను – మారుతి
Published on Oct 8, 2017 1:30 pm IST

‘మహానుభావుడు’ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు మారుతి తన తదుపరి చిత్రం కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య హీరోగా చేయనున్న ఈ సినిమా గురించి మారుతి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ సినిమాను నాగ చైతన్యను దృష్టిలో పెట్టుకునే రాశానన్న మారుతి ‘ఏఎన్నార్, నాగార్జునలాగే నాగ చైతన్య కూడా ప్రేమ కథలకి బాగా సరిపోతాడు. ఈ కథకు ఆయన మాత్రమే న్యాయం చేయగలడు’ అన్నారు.

అందమైన ప్రేమ కథగా ఉండబోతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉండగా నవంబర్ నుండి చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు. ఇకపోతే మారుతి తన సొంత బ్యానర్ మారుతి టాకీస్ పై మరో మూడు చిత్రాలను నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook