‘పుష్ప’ కోసం అసలు రంగంలోకి దిగనున్న ఐకాన్ స్టార్.?

‘పుష్ప’ కోసం అసలు రంగంలోకి దిగనున్న ఐకాన్ స్టార్.?

Published on Oct 24, 2021 6:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కీలక యూనిట్ అందరికీ కూడా ఇదే మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అలానే అల్లు అర్జున్ కి మాత్రం ఇది ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్.

బన్నీ కి మన సౌత్ ఆడియెన్స్ తో పాటుగా హిందీ ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే పుష్ప తో హిందీలో అల్లు అర్జున్ కి ఎలాంటి ఎంట్రీ థియేట్రికల్ గా దక్కుతుందా అని ఆసక్తి నెలకొంది. మరి వాళ్ళని థియేటర్స్ వరకు రప్పించాలంటే ఏ పాన్ ఇండియన్ సినిమాకి అయినా ప్రమోషన్స్ నే మెయిన్ ఎసెట్.

అందుకే బన్నీ బాలీవుడ్ ప్రేక్షకుల కోసం రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. సినిమా రిలీజ్ కి ఒక రెండు మూడు వారాలు ముందు ముంబైలో బన్నీ అడుగు పెట్టనున్నాడట. మరి అంతా అనుకున్నట్టే కనుక జరిగితే డెఫినెట్ గా పుష్ప భారీ ఓపెనింగ్స్ అక్కడ నుంచి రాబట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు