అన్నీ బాగుంటే “ఆచార్య” విడుదల అప్పటికి.!

Published on Apr 29, 2021 11:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భయారే బడ్జెట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంను అప్పుడు పరిస్థితులు బాగున్నా సమయంలో వచ్చే మే 13నే వేసవి కానుకగా విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.

కానీ ఊహించని విధంగా మళ్ళీ పరిస్థితులు మారిపోవడంతో వాయిదా వేశామని అధికారికంగా తెలియజేసారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్త విడుదల తేదీకి అది కూడా అన్నీ కరెక్ట్ గా సెట్టయితే రెండు సమయాలను మేకర్స్ అనుకుంటున్నారట. అయితే వచ్చే జూలై చివరిలో కానీ లేదా ఆగష్టు మొదటి వారంలో కానీ విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు నయా గాసిప్.

మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :