మెగాస్టార్ కి కథ నచ్చితే.. క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ !

Published on Apr 25, 2021 1:00 am IST

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. అందుకే చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కి కొత్త కథలు చెప్పడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ కూడా ఉన్నాడట. ఈ సంచలన దర్శకుడు మెగాస్టార్ కోసం ఒక కథ రాశాడట. చిరు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా కథ ఉంటుందట. మరి చిరుకి కథ ఈ కాంబినేషన్ లో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. కాకపోతే.. వచ్చే ఏడాదే సినిమా ఉంటుంది, అది కూడా కథ నచ్చితేనే.

ప్రస్తుతం దర్శకుడు సందీప్ వంగ సీనియర్ నటుడు అనీల్ కపూర్ – రణబీర్ కపూర్ – బాబీ డియోల్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ మూవీ ‘యానిమల్’ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయికగా నటించబోతుంది. కాగా క్రేజీ కాంబినేషన్‏లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్ అని తెలుస్తోంది. నిర్మాతలు సందీప్ సినిమాలకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం :