అదే జరిగితే ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ రెండేళ్లు మిస్సైనట్లే…!

Published on Nov 19, 2019 3:03 pm IST

2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ కొన్నిసార్లు మినహాయించి ప్రతి ఏడాది దాదాపు రెండు చిత్రాలకు తగ్గకుండా విడుదల చేస్తూ వస్తున్నారు. 2017లో జై లవ కుశ మూవీ విడుదలవగా, గత ఏడాది త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత చిత్రంలో నటించారు. ఇక 2019 ఎన్టీఆర్ నుండి ఎటువంటి చిత్రం రాకుండానే ముగియనుంది. గతంలో కూడా 2009లో ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హం.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. గత ఏడాది చివర్లో సెట్స్ పైకెళ్లిన ఈ మూవీ షూటింగ్ అనుకోని అవాంతరాల వలన వాయిదాపడుతూ వచ్చింది. దీనితో జక్కన్న అనుకున్నంత మేర షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీనితో రాజమౌళి ప్రకటించినట్లు 2020 జులై 30న ఆర్ఆర్ఆర్ థియేటర్స్ లోకి వచ్చే ఆస్కారం లేదని కొందరి వాదన. ఏకంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ 2021కి షిఫ్ట్ ఐయ్యిందని టాలీవుడ్ వర్గాలలో జరుగుతున్న ప్రచారం.

ఇదే గనక జరిగితే ఎన్టీఆర్ వచ్చే ఏడాది కూడా తెరపై కనిపించరు. దీనితో రెండేళ్లు ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని మిస్సవుతారన్న మాట. మరి జక్కన్న అనుకున్న ప్రకారం ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తారో లేదో చూడాలి. ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజులుగా ఎన్టీఆర్, చరణ్ లు నటిస్తున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా, అలియా భట్, అజయ్ దేవ్ గణ్ వంటి నటులు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More