అలా అయితే “ఆచార్య” టార్గెట్ అప్పటికా.?

Published on Aug 14, 2021 5:01 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా ఫాన్స్ లో ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ షూట్ ఇంకా కొంత మేర బ్యాలన్స్ ఉంది. అయితే ఈ చిత్రం రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా టాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు.

మరి దానిపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వినిపించినా మళ్ళీ ఒరిజినల్ డేట్ ఏమిటి అన్నది మేకర్స్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ మరో భారీ చిత్రం “RRR” చిత్రం రిలీజ్ డేట్ కనుక వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవ్వడం కన్ఫర్మ్ అయితే ఆ టైం కి అంటే అక్టోబర్ రిలీజ్ రేస్ లో ఆచార్య ఉండొచ్చని టాక్ నడుస్తుంది.

అయితే ఇందులో ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ ఒకవేళ ఛాన్స్ ఉంటే ఆచార్య టార్గెట్ అప్పుడు ఉండొచ్చట. మరి ఈ చిత్రం విడుదల ఎపుడు ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :