అను ఇమ్మాన్యుయేల్ స్థానంలో ఇలియానా ?
Published on May 21, 2018 9:20 am IST

రవితేజ త్రిపాత్రాభినయంలో చేస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ అంటోని’. శ్రీను వైట్ల దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖహ్ న్రిమాన సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ముందుగా అను ఇమ్మాన్యుయేల్ ను కథానాయకిగా అనుకోగా డేట్స్ కుదరనందున ఆమె కాస్త ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో ఇలియానను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఒకవేళ ఇదే నిజమైతే తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్న గోవా బ్యూటీకి ఇదొక చక్కని అవకాశమవుతుంది. ఇలియాన గతంలో రవితేజతో కలిసి ‘కిక్, దేవుడు చేసిన మనుషులు’ వంటి సినిమాల్లో నటించారు. మొత్తం ముగ్గురు కథానాయికలకు చోటున్న ఈ సినిమాలో మరొక కథానాయకిగా శృతి హాసన్ ను అనుకుంటున్నట్లు కూడ వార్తలోస్తున్నాయి. మరి వీటన్నిటిలో ఎంతవరకు వాస్తవముందో తేలాలంటే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.

 
Like us on Facebook