ఐఎండిబి 2018 టాప్ 10 సినిమాలు !

Published on Dec 13, 2018 12:33 pm IST

ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి) 2018 కిగాను ఇండియాలో టాప్ 10 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. ఈజాబితాలో టాలీవుడ్ నుండి మహానటి (4), రంగస్థలం(7) స్థానాల్లో చోటు సంపాందించాయి. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మహనటి’ ఈ ఏడాది మే లో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. అలనాటి నటి సావిత్రి జీవితం ఆదరంగా తెరకెక్కింది ఈచిత్రం .

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రూరల్ డ్రామా ‘రంగస్థలం’ ఈ ఏడాది మార్ఛి లో విడుదలై అద్భుతమైన విజయం తో బాహుబలి తరువాత అత్యదిక వసూళ్లను సాధించిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఐఎండిబి 2018 టాప్ 10 లో చోటు సంపాదించిన చిత్రాలు :

1. అంధాదున్ (హిందీ )

2. రట్సాసన్ (తమిళం )

3. 96 (తమిళం )

4. మహానటి (తెలుగు)

5. బడాయి హో (హిందీ)

6. ప్యాడ్ మ్యాన్ (హిందీ)

7. రంగస్థలం (తెలుగు)

8. స్ట్రీ (హిందీ)

9. రాజీ (హిందీ)

10. సంజు (హిందీ)

సంబంధిత సమాచారం :